హెలికాప్టర్ రెడీ చేసుకున్న కేసీఆర్

Kcr-helicopter

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఒక హెలికాప్టర్ ను సిద్ధం చేసుకున్నారు. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11 నుంచి కేసీఆర్ ప్రచార పర్వం మొదలవ్వాలి. అయితే, వీలైనంత ముందుగానే ప్రజల్లోకి వెళ్లాలనే భావనతో ఏప్రిల్ 1 నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. హెలికాప్టర్ కూడా అందుబాటులోకి రావడంతో, రోజుకు మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలనే భావనలో కేసీఆర్ ఉన్నారు. హైర్ కు తీసుకున్న హెలికాప్టర్ ఇప్పటికే కేసీఆర్ ఫాం హౌస్ లో ల్యాండ్ అయింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.