హైదరాబాద్ లో రూ.5 కే భోజనం ప్రారంభం

హైదరాబాద్ లో రూ.5 కే భోజనం ప్రారంభం

పేదలకు 5రూపాలయకే భోజనం అందించే పథకం హైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభమైంది. నాంపల్లిలోని మున్సిపల్ భవనం సరాయిలో దీన్ని మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.11 కోట్లతో ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని తొలుత నాంపల్లిలో ప్రారంభించామని, దీన్ని త్వరలో నగరంలోని 50 కేంద్రాలకు విస్తరిస్తామని తెలిపారు. ఒక్కొక్క కేంద్రంలో తొలుత 300 మందికి భోజనం అందిస్తామని తెలిపిన ఆయన, పేదవాడికి ఈ పథకం ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనం అందించడం తమ లక్ష్యమని వివరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.