హోమోసెక్స్, సహజీవనం ఇస్లాంకు వ్యతిరేకమంటూ ఫత్వా జారీ

స్వలింగ సంపర్కం, సహజీవనం ఇస్లాంకు వ్యతిరేకమంటూ ఉత్తరప్రదేశ్ లోని బరేలీ పట్టణానికి చెందిన ఒక ముస్లిం మత సంస్థ ఫత్వా(నిషేధాజ్ఞలు) జారీ చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని షరియత్ చట్టం పేర్కొంటోందని తెలిపింది. దారుల్ ఉలూమ్ ఇఫ్తాకు చెందిన మొహమ్మద్ అఫ్జల్ రిజ్వీ ఈ ఫత్వా జారీ చేశారు.

ఖురాన్ లోని కొన్ని సూత్రాలను కూడా ఆయన అందులో ఉదహరించారు. ఇలాంటి పనులకు పాల్పడిన వారిని జీవించి ఉండగానే దహనం చేయడం, ఎత్తయిన ప్రాంతం నుంచి కిందకు తోసేయడం, బహిరంగంగా ప్రజల ముందు రాళ్లతో కొట్టడం లాంటి శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర ముస్లిం మత సంస్థలు కూడా ఈ ఫత్వాకు మద్దతు పలికాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.