హోరెత్తిన నిరసనలు

హోరెత్తిన నిరసనలు

న్యూఢిల్లి : సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు హోరెత్తుతున్నాయి. రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ నివాసం ఎదుట బుధవారం సీమాంధ్ర ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. దిగ్విజయ్ ను ఈ రోజు కలిసిన సీమాంధ్ర ఉద్యోగ ప్రతినిధులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. కాని రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని, మీకేమైనా సమస్యలు ఉంటే అంటోనీ కమిటీకి చెప్పుకోవాలని దిగ్విజయ్ సూచించారు. దీంతో సీమాంధ్ర ఉద్యోగులు సమావేశాన్ని వదిలి బయటకు వచ్చి దిగ్విజయ్ నివాసం ఎదుటే నిరసన చేపట్టారు. అప్పుడక్కడికి వస్తున్న వట్టి వసంతకుమార్, ఆనం రామనారయణ్ రెడ్డి రావడంతో వారిని అడ్డుకుని పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ కారులో బయటకు వస్తుండగా దిగ్విజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.