హోరెత్తిస్తున్న సమైక్య ఉద్యమం

హోరెత్తిస్తున్న సమైక్య ఉద్యమం

samikyandhra

రాష్ర్ట విభజనను నిరసస్తూ సీమాంధ్రలో సమైక్య ఉద్యమాల హోరు కొనసాగుతోంది. దీక్షలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనల సమైక్య ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ రంగాల ఉద్యోగులు, వారు వీరు అని కాదు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో కనిపిస్తున్నారు. అనకాపల్లిలో మానవహారం రూపంలో నిరసన తెలిపారు. రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లిం మహిళలు మానవహారం నిర్మించారు. అనంతపురంలో రిలే నిరాహారదీక్షలు జరిగాయి. గుంటూరులో రెవిన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు మానవహారం కట్టారు. కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ తదితర పట్టణాలు అట్టుడుకుతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.