10 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని

హైదరాబాద్, నవంబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీలలో మోదీ పర్యటించనున్నారు. మొదటగా మైన్మార్ లో జరిగే ఏషియన్ ఇండియా సమావేశంలో మోదీ పాల్గొంటారు. తర్వాత ఆస్ట్రేలియాలోని బ్రిస్బీన్ నగరంలో జరిగే జి 20 సమావేశానికి హాజరు కానున్నారు. నల్లధనం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ ప్రసంగం సాగనుంది. 40 మంది దేశాధినేతలతో మోదీ సమావేశం కానున్నారు. అణుఒప్పందపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. అలాగే దక్షిణ పసిఫిక్ ద్వీపమైన ఫిజిలోకూడా ప్రధాని పర్యటన కొనసాగనుంది. 28 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. 1986లో రాజీవ్ గాంధీ అక్కడ పర్యటన తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. సిడ్నీలో భారత ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించబోతున్నారు. మెల్ బోర్న్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొంటారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.