‘100% బ్రేకప్ ప్రేమలో పడితే’ మూవీ రివ్యూ

100% Breakup Lovelo padithe movie Review by Sakalam

100% Breakup Lovelo padithe movie Review by Sakalam

ఎస్‌బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్‌ కాదలా’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘100% బ్రేకప్‌ ప్రేమలో పడితే ’ పేరుతో విడుదల చేశారు. మధుమిల, అభినయ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. స్టోరీలో బలం ఉండి పటిష్టమైన స్క్రీన్‌ప్లేతో ఉన్న పరభాషా అనువాద చిత్రాలను మనోళ్ళు ఎంతబాగా ఆదరిస్తారో బిచ్చగాడులాంటి సినిమా చూపించింది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో తమిళంలో విడుదలకంటే ముందే తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడి అంచనాలు ఏమేరకు అందుకుంది?

 

కథ:

వీర (ఎజిల్ దురై) అనే ఓ అబ్బాయి ఇంట్లో కనిపించకుండా పోయేసరికి ఎలాంటి అఘాయిత్యం చేసుకున్నాడోనని  ఇంట్లోవాళ్ళందరూ భయపడి అతని గురించి వెతకడం ప్రారంభిస్తారు. అలా వెతికే క్రమంలో వీర గతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అతని స్నేహితులు. వీర తన చెల్లెలు స్కూల్‌మేట్ అయిన అనుష్క (మధుమిల) అనే అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే చూసి ఇష్టపడుతాడు. అయితే ఆ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు మరోసారి కాలేజీ ఫెస్ట్‌లో వీరను గుర్తుపట్టిన అను అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు దగ్గరై హాయిగా ఉంటారు. అలా ఉన్న కొన్ని నెలల తర్వాత ఎంబిఎలో చేరిన అను అక్కడ తన క్లాస్‌మేట్ సాయి అనే అబ్బాయితో స్టూడెంట్ ఎలెక్షన్లలో గెలిచి ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ప్రోద్బలంతో నెమ్మదిగా వీరను వదిలించుకోవడానికి ప్రయత్నించి చివరికి సక్సెస్ అయి వీరకు బ్రేకప్ చెప్పేస్తుంది. అయినప్పటికీ కొన్నిరోజులు అను వెంట తిరిగిన వీర చివరికి ఓ రోజు ఇంటినుండి కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వీర ఎక్కడి వెళ్తాడు? ఇంట్లో తన తండ్రి గన్ తీసుకెళ్ళిన వీర ఏమైనా అఘాయిత్యానికి ఒడిగడుతాడా లేక తన లవ్‌కు బ్రేకప్ చెప్పిన అనుపై ప్రతీకారం తీర్చుకుంటాడా అన్నదే కథ.

 

ఎనాలసిస్:

భారతీయ సినిమాల్లో లవ్ అండ్ కామెడీ ట్రాక్స్‌లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ వచ్చే ప్రతీ సినిమా కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే దర్శకుడు తీసుకొనే కొత్త యాంగిల్ కారణంగా సినిమాలో కొత్తదనం వచ్చేస్తుంది. అలాంటి సినిమానే 100%బ్రేకప్ లవ్‌లో పడితే. లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందించారు. ఎజిల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నేటి యూత్ ప్రేమల్, బ్రేకప్ నేపథ్యంలో చిత్ర కథ ఉంటుంది. నిర్మాత ఎస్‌. బాలసుబ్రమణ్యన్‌ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఎందుకంటే లవ్ అనేది యూనివర్శల్ సబ్జెక్ట్. తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరించే సినిమా ఇది. ఆర్టిస్టులు కొత్తవారైనప్పటికీ… పాత్రల్ని దర్శకుడు చక్కగా మలిచాడు. దీంతో అందరూ కనెక్ట్ అవుతారు. ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూనే దర్శకుడిగానూ… తన ప్రతిభ చూపించాడు. రెండు పడవల మీద కాలు పెట్టినప్పటికీ… న్యాయం చేయగలిగాడు. లవ్‌తో పాటు, కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనువాద కార్యక్రమాలు చేశారు. ఇంతవరకు ఎవరూ షూటింగ్‌ చేయని లొకేషన్లలో చిత్రీకరించడంతో ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. అభినయ కు మంచి క్యారెక్టర్ దొరికింది. మిగిలిన పాత్రల్లో మైమ్‌ గోపి, మద్రాస్‌ రమ, మహానది శంకర్‌, అజయ్‌ రత్నం, వేన్‌, కాయల్‌ విన్సెంట్‌ తదిత రులు మంచి పాత్రల్లో కనిపించారు. సినిమాటోగ్రఫి అందించిన ఎం.మనీష్‌ తన పనితనం చూపించాడు. లారెన్స్‌ కిషోర్‌ ఎడిటింగ్ బాగుంది. రాజ్‌భరత్‌ పాటలు రీ రికార్డింగ్ ప్లస్ అయ్యాయి. ఈ చిత్రం ముఖ్యంగా యూత్ కి కనెక్ట్ అయ్యే చిత్రం.

 

ఓవరాల్: ఢిపరెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన ఆకట్టుకున్న సినిమా

 

రేటింగ్: 2.75 / 5

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.