12 ఒప్పందాలపై భారత్-చైనా సంతకాలు : మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18 : మూడు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చర్చలు, పలు ఓప్పందాలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. చైనా ప్రధాని జి జిన్పింగ్‌తో గురువారం ఢిల్లీలో హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ సుమారు 90 నిమిషాలపాటు చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చైనా మనకు అత్యంత సన్నిహత దేశమని అన్నారు. భారత్, చైనాల మధ్య 12 కీలక ఒప్పందాలపై అంగీకారం కుదిరింది.  ఆర్థిక, వాణిజ్య, ప్రణాళిక, దృశ్య శ్రవణ మాద్యమం, రైల్వే, సాంస్కృతిక, అంతరిక్షం, పాలన, పన్నులు, మానవ సరోవరంకు రోడ్డు నిర్మాణం, షాంఘై-ముంబై నగరాల అభివృద్ధి తదితర వాటిపై ఒప్పంద సంతకాలు జరిగినట్లు మోదీ  తెలిపారు. అదేవిధంగా చైనా-భారత్‌ సంబంధాలపై కీలక చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు. వాణిజ్య, వ్యాపారానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఐదేళ్ల పాటు ఒప్పందం కుదరడం గొప్ప ముందడుగు అన్నారు.  అమ్మకాలు పెట్టుబడులపై భారత కంపెనీలకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు మోదీ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.