14 మంది కాంగ్రెస్ సభ్యుల ఒకరోజు పాటు సస్పెన్షన్

హైదరాబాద్, నవంబర్ 18: పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ శాససనసభ అట్టుడికింది. పార్టీ ఫిరాంయిపుల అంశంపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడినప్పటికీ పరిస్థతిలో మార్పురాలేదు. శాసససభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకొని మాట్లాడుతూ సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగటం కాంగ్రెస్ సభ్యులకు ఇష్టం లేదని విమర్శించారు. సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న 14 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను సభనుంచి ఒకరోజు సస్పెండ్ చేయాలని హరీష్ రావు ప్రతిపాదించగా దీనికి స్పీకర్ ఆమెదం తెలిపారు. దీంతో కాంగ్రెస్ శాసనసభ్యులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, డి.కె.అరుణ, రామ్మోహన్ రెడ్డి, సంపత్ కుమార్, కృష్ణారెడ్డి, పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో సభ్యుడిని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.Recent Posts
Recent Posts