దోషులు వీళ్ళే…

1993-mumbai-serial-blasts-tada-court-convicts-abu-salem-and-7-others

దేశాన్నే కుదుపు కుదిపేసిన 1993 ముంబై వరుస పేలుళ్ళ కేసులో ఎట్టకేలకు టాడా కోర్టు తీర్పుని వెలువరించింది. సుమారు రెండు గంటల వ్యవధిలోనే 12చోట్ల బాంబు పేలుళ్లు జరగడంతో సుమారు 257 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 700మందికి పైగా గాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతపెద్ద ఎత్తున ఆర్డీఎక్స్‌ను ఉపయోగించి పేలుళ్లకు పాల్పడడంతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.

1993-mumbai-serial-blasts-tada-court-convicts-abu-salem-and-7-others

ఈ ఘటనలో 2007లో టాడా కోర్టు తొలి దశ విచారణను పూర్తి చేసింది. అందులో 100మందిని నిందితులుగా గుర్తించగా.. మరో 23 మందిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే ఈ ట్రయల్‌ పూర్తయిన తర్వాత ఈ కేసులో అబు సలెం, ముస్తాఫా దోసా, కరిముల్లా ఖాన్‌, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌, రియాజ్‌ సిద్ధిఖీ, తాహిర్‌ మర్చంట్‌, అబ్దుల్‌ ఖయ్యుంలను కీలక నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులపై 2007లో విచారణ ప్రారంభించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఆ తర్వాత 2012లో విచారణను పునరుద్ధరించారు. విచారణలో అబుసలెం సహా మరో ముగ్గురు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు యాకుబ్‌ మేనన్‌కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. 2015 జులై 30న యాకుబ్‌ను ఉరితీశారు.

దీంతో పేలుళ్ల కేసులో మళ్లీ రెండో దశ విచారణ చేపట్టారు. రెండోదశలో అబుసలెం, ముస్తాఫా సహా ఏడుగురిని కుట్ర ఆరోపణలు, హత్య, ఉగ్ర కార్యకలాపాల తదితర నేరాల కింద వీరిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. గుజరాత్‌ నుంచి ముంబయికి ఆయుధాలు రవాణా చేసిన ఆరోపణలతో అబు సలెంను అరెస్టు చేశారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కూడా అబుసలెం ఆయుధాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. కాగా.. మరో నిందితుడు ముస్తాఫాను ఆర్డీఎక్స్‌ పేలుళ్ల సూత్రధారిగా పేర్కొంటూ అరెస్టు చేశారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.