బ్రేకింగ్: అన్నాడీఎంకె నుండి శశికళ, దినకరన్‌ల గెంటివేత

20 ministers decided to throw sasikala and Dinakaran out of aiadmk panel to work on ops eps merger

20 ministers decided to throw sasikala and Dinakaran out of aiadmk panel to work on ops eps merger

జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణం మారిపోతున్నాయి. పన్నీర్ సెల్వం శశికళ వర్గానికి వ్యతిరేకంగా బయటికి వెళ్ళినప్పటినుండి ఆర్కెనగర్ ఉపఎన్నికల రద్దు వరకు అనేక అంశాల్లో మార్పులు జరిగాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. పన్నీర్ సెల్వం దగ్గరి నుండి అధికారాన్ని లాక్కున్న తర్వాత ఇంత కాలం చిన్నమ్మ శశికళ విధేయులుగా ఉన్న సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తానికి ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడానికి రంగం సిద్దం చేసుకున్నారు.

ఎఐఎడిఎంకెకు చెందిన రెండాకుల గుర్తును కాపాడుకోవాలంటే రెండు పక్షాలు కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు గ్రూపుల విలీనం దిశగా సాగిన వూహాగానాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. శశికళ కుటుంబం ఉన్నంతవరకు విలీనం సాధ్యం కాదని పన్నీర్‌ సెల్వం తేల్చిచెప్పారు. అన్నాడీఎంకేలో ఏ ఒక్క కుటుంబం ఆధిపత్యం చెలాయించరాదన్నదే అమ్మ జయలలిత అభిమతమని చెప్పుకొచ్చారు పన్నీర్. అమ్మ మరణించక ముందు దినకరన్‌ కనీసం పార్టీ సభ్యుడు కూడా కాదని, పార్టీకి జరిగిన ఎన్నికలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నివేదిక అందజేశామన్నారు. పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడిన తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారాయి. తెర వెనకు శశికళ, ఆమె అక్క కుమారుడు, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ కు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు మంతనాలు జరుపుతున్నారు.

OPS EPS

అంతేగాక అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పార్టీ సీనియర్ నేతలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, సొంత పార్టీ నేతల పదవులకే ఎసరుపెడుతున్నారని తమిళనాడు మంత్రులు మండిపడుతున్నారు. అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల నేతలు కలిసిపోతేనే మేలు అని నిర్ణయించారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గం, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గం శశికళ, దినకరన్‌లకు వ్యతిరేకంగా పావులు కదిపారు. శశికళను పక్కనపెట్టాలంటే తనకి పన్నీర్ సెల్వం సహకారం ఖచ్చితంగా ఉండాలని తెలుసుకున్న పళని స్వామి అందుకు తగ్గట్లుగా పార్టీ సీనియర్ మంత్రులతో చర్చలు జరిపారు.ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తూ తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న శశికళకు ఇక కచ్చితంగా సినిమా చూపించాలని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించారు.

అయితే రెండు వర్గాలు ఒక్కటై ఇప్పుడు చిన్నమ్మ శశికళను, దినకరన్‌లను  ఎఐఎడిఎంకే నుండి బయటికి పంపిచాలని నిర్ణయించుకున్నారు. అందులోభాగంగా 20 మంది మంత్రులు ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వంలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక దినకరన్‌పై 50 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసు ఉన్నందువల్ల రాష్ట్రంలో పార్టీ పరువు పోకుండా కాపాడుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.