2014-15 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. 2014-15 తెలంగాణ రాష్ట్ర  బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం వెలకట్టలేనిదని, అమరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామన్నారు. 459 మంది అమరవీరులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.

 

తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు.

ప్రణాళికా వ్యయం రూ. 48,648 కోట్లు.
ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు
ఆర్థిక లోటు రూ.17,398 కోట్లు

 

సంక్షేమ రంగం…

ఎస్సీ ఉపప్రణాళికకు రూ. 7,579 కోట్లు.
ఎస్టీ ఉపప్రణాళికకు రూ. 4,559 కోట్లు.
బీసీ సంక్షేమానికి రూ. 2,022 కోట్లు.

మైనార్టీల సంక్షేమానికి రూ. 1,030 కోట్లు.

కల్యాణలక్ష్మీ(ఎస్సీ) పథకానికి రూ. 150 కోట్లు.

కల్యాణలక్ష్మీ(ఎస్టీ) పథకానికి రూ. 80 కోట్లు.

మహిళా, శిశు సంక్షేమానికి రూ. 221 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

వైద్య ఆరోగ్య రంగానికి రూ. 2,282 కోట్లు

విద్యా రంగం రూ.10,956 కోట్లు

విద్యుత్ రూ.3,241 కోట్లు

విలేకరుల సంక్షేమానికి రూ.10 కోట్లు

హైదరాబాద్ మహిళల భద్రతకు రూ.10 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు

దీపం పథకానికి రూ.100 కోట్లు

వితంతువుల కోసం రూ.450 కోట్లు

2019 నాటికి ఎస్సీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు

 

అభివృద్ధి రంగం…

గోదావరి పుష్కరాలకు రూ 100 కోట్లు

ప్రజారోగ్యానికి రూ.2,282.85 కోట్లు

మార్కెట్ ఇంటర్ వెన్షన్ కోసం రూ.400 కోట్లు

నీటిపారుదలకు రూ.6,500 కోట్లు

రహదారుల అభివృద్ధికి రూ 4 వేల కోట్లు

ఆర్టీసీకి రూ.400 కోట్లు

ఎస్సీ పారిశ్రామికి వేత్తలను ప్రోత్సహించేందుకు రూ 97.5 కోట్లు

శాసనసభ నియోజవర్గాల అభివృద్ధికి రూ.234 కోట్లు

చెరువుల పునరుద్ధరణ రూ.2000 కోట్లు

Have something to add? Share it in the comments

Your email address will not be published.