27శాతం ఐఆర్ పెంపుకు ప్రభుత్వ అంగీకారం

IR-Employees

మధ్యంతర భృతిపై ఎట్టకేలకు చర్చలు సఫలమయ్యాయి. రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగాయి. బుధవారం మంత్రి ఆనంతో ఉద్యోగసంఘాలు భేటీ అయ్యి చర్చించాయి. ఉద్యోగసంఘాలు 32శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం మాత్రం 22 శాతానికంటే ఎక్కవ ఇవ్వలేమని ఆనం ఉద్యోగసంఘాలకు తెలిపారు.

చివరికి ఎటువంటి నిర్ణయం లేకుండానే అర్థాంతరంగానే వీరిమధ్య చర్యలు ముగిశాయి. గురువారం ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రెండున్నరగంటల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు ఓ మెట్టుదిగిరావడంతో 27శాతం మధ్యంతర భృతికి అంగీకారం కుదిరింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.