ప్రైవేట్ ఆస్పత్రిలో మగశిశువు అదృశ్యం

ప్రైవేట్ ఆస్పత్రిలో మగశిశువు అదృశ్యం

ఆసుపత్రుల నుండి చిన్నారులు అదృశ్యంకావడం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మగ పిల్లలను ఎత్తుకెళ్తున్న ముఠా ఈసారి కరీంనగర్ జిల్లాలో తెగబడింది. కరీంనగర్ జిల్లాలోని చెల్మడ ఆనందరావు ఆస్పత్రిలో నాలుగు రోజుల మగశిశువు అదృశ్యమైంది.

దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళన చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆగ్రహించిన బాధితుల తరుపు బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

ఓ జంట పెద్ద బ్యాగును తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఆ బ్యాగులోనే శిశువును తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.