41ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

President-rule-in-andhra

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడమే సరైన నిర్ణయమని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అధికారికంగా మీడియాకు తెలియజేసారు. దీంతో 41 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలన వచ్చినట్టైంది. రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడంతో రాష్ట్ర పాలనా పగ్గాలు గవర్నర్ నరసింహన్ చేతిలోకి వెళతాయి.

మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండో సారి. 1973లో పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు. మళ్లీ ఇప్పటి వరకూ రాష్ట్రపతి పాలన అవసరం రాలేదు. రాష్ట్రంలో జైఆంధ్ర ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామా చేయడంతో, పాలనా వ్యవస్థ అస్తవ్యస్థం అయింది. దీంతో అప్పట్లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రంలో తొలిసారి రాష్ట్రపతి పాలన కొనసాగింది.

ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణ లేకపోవడంతో మరోసారి రాష్ట్రపతి పాలన అనివార్యం అయింది. రాష్ట్ర విభజన జరిగిపోవడం, వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో, రాష్ట్రపతి పాలన వైపే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.