ఎమాన్ ‘242 కేజీలు’ తగ్గిందట..!

500kg Egyptian woman Eman Ahmed showing signs of recovery and reduced 242 kgs

500kg Egyptian woman Eman Ahmed showing signs of recovery and reduced 242 kgs

ప్రపంచంలో అత్యంత బరువున్న మహిళగా ఉన్న ఎమాన్ అహ్మద్ ప్రస్తుతం టార్గెట్‌ను రీచ్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ముంబైలో రెండు నెలల క్రితం అడుగుపెట్టినప్పుడు 490కేజీలు ఉన్న ఈజిప్టు మహిళ బరువు కారణంగా 20ఏళ్ళుగా ఇంట్లో నుండి అడుగు బయటపెట్టలేకపోయింది. ఈ రెండు నెలల్లో డాక్టర్లు సూచించిన ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ సుమారు 100కేజీలు తగ్గిపోయింది.

గతనెల 7న ఎమాన్‌కు సర్జరీ చేసిన డాక్టర్లు ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా 75శాతం ఉదరభాగాన్ని తొలగించారు. దీంతో మార్చి 29కల్లా 340 కేజీలకు తగ్గింది. ఈ సర్జరీ తర్వాత వచ్చే ఏడాదిన్నరలో 150కేజీలు తగ్గుతుందని డాక్టర్లు భావించారు. అయితే ఎమాన్ మాత్రం కేవలం 13రోజుల్లో 98కేజీలు తగ్గడం డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఏకంగా రెండు నెలల్లో 242 కేజీలు తగ్గింది. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్ట‌ర్ ముఫ‌జ‌ల్ ల‌క్డావాలా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వైద్యరంగంలో ఆయ‌న అందించిన సేవ‌ల‌కుగాను మ్యాన్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు అందుకున్న‌ సంద‌ర్భంగా ల‌క్డావాలా.. ఎమాన్ గురించి చెప్పాడు.

ప్రస్తుతం గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు అన్నీ సాధార‌ణంగా ప‌నిచేస్తున్నాయి. అయితే అప్పుడప్పుడూ శ‌రీరంలో కుడిభాగం ప‌నిచేయ‌క‌పోవ‌డం, ఫిట్స్‌లాంటివి వ‌స్తూనే ఉన్నాయి. అంతేగాక గతవారం నుంచి ఎమాన్‌ తన ముఖాన్ని చేతితో తాకగలుగుతున్నారని ముఫజల్‌ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.