576 మంది ప్రభుత్వ ఉద్యోగులపై నితీష్ ప్రభుత్వం వేటు!

Nitish-kumar

అవినీతి నియంత్రణలో భాగంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వేటు వేశారు. రెండు నెలల్లోగా 576 మంది అధికారులు, ఉద్యోగులను డిస్ మిస్ చేయాలని నితీశ్  ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్స్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఓ వారంలో వీరిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఏకే సిన్హా తెలిపారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసి త్వరిత చర్యలు తీసుకోవాలని సీఎం నితిష్ కుమార్ తమకు సూచించారని ఏకే సిన్హా మీడియాకు చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ జల్ బోర్డులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను బదిలీచేసింది. ఈ తరహాలోనే నితిష్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.