‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి డాడీ’

A 12 year old Sai Sri brings tears to everyone with her Selfie video to her father for saving her life

అల్లారుముద్దుగా పెంచుకొనే బిడ్డలు చిన్న అనారోగ్యానికి గురైనా, జ్వరం వచ్చినా ఎంతో తల్లడిల్లిపోయే తల్లిదండ్రులు తొందరగా నయం కావాలని ఎంతో హడావిడి చేస్తుంటారు. డాక్టర్ల దగ్గరకి తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు జ్వరం తగ్గుతుందా అని అక్కడే ఉండి నిద్రహారాలు మాని కంటికి రెప్పలా చూసుకుంటుంటాం. అలాంటిది మన బిడ్డకు ఏదైనా ప్రాణాలు తీసే జబ్బు వచ్చిందంటే ఎంతో అల్లాడిపోయి, ఆఖరికి ఉన్నదంతా అమ్ముకొనైనా పస్తులుండైనా ఆ చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తాం. అయితే విజయవాడలో జరిగిన ఓ ఘటన మానవతకే మచ్చ తెచ్చిపెట్టింది. మనుషులంటే డబ్బులు సంపాదించడమొక్కటేనని, మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలేనని తేల్చేలా ఓ తండ్రి తన కూతురి పట్ల చూపించిన కర్కషత్వం మానవ సమాజాన్నే సిగ్గుపడేలా చేసింది.

కన్న తండ్రి కర్కశానికి ఓ పన్నెండేళ్ళ చిన్నారి బలైంది. చనిపోయే ముందు బ్రతకాలని ఉంది .. నన్ను బ్రతికించండి డాడీ అంటూ విజయవాడకు చెందిన సాయిశ్రీ తన తండ్రికి సెల్ఫీ వీడియో పంపించినప్పటికీ కన్నతండ్రి మనసు ఏమాత్రం కరగకపోవడంతో చివరికి చేసేదేంలేక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే ప్రణాలు పోయేముందు ఆ పాప మాట్లాడిన వీడియో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఆ వీడియో అందరికీ కంటతడి పెట్టిస్తోంది ఒక్క కన్నతండ్రిని తప్ప.

మాదంశెట్టి శివకుమార్‌, సుమశ్రీలు భార్య భర్తలు. ఇరువురు విడిపోయారు. వారికి సాయిశ్రీ అనే పాప ఉంది. అయితే, వారు విడిపోయే సందర్భంలో సాయిశ్రీ పేరిట దుర్గాపురంలో ఓ ఇంటిని రాసిచ్చాడు శివకుమార్‌. అతడు ఓ రౌడీ షీటర్‌.. పైగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురి నాయకుల అండదండలు ఉన్నాయి.

అయితే అనుకోకుండా ఈమధ్య సాయిశ్రీ క్యాన్సర్‌ బారిన పడింది.ఆమెను రక్షించుకోవడానికి తల్లి సుమశ్రీ తన వద్ద ఉన్న డబ్బులంతా ఖర్చుపెట్టింది. అయితే మెరుగైన వైద్యం చేయించని పక్షంలో చిన్నారి బ్రతకదని అపోలో వైద్యులు  తేల్చి చెప్పడంతో బెంగళూరులో కేన్సర్‌ వైద్యం కోసం తీసుకెళ్లాలనుకున్నారు. అయితే తన ప్రాణం రక్షించుకునేందుకు ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటూ సాయిశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ శివకుమార్‌ ఇంటి చుట్టూ దాదాపు పది రోజులు తిరిగింది. అప్పటికే సాయిశ్రీకి కేన్సర్‌ ఉన్నట్లు తెలుసుకున్న శివకుమార్‌ అదే అదనుగా చూసుకొని ఎమ్మెల్యే అండదండలతో కొంత మంది కబ్జాదారులతో దుర్గాపురంలో కూతురుకి రాసిచ్చిన ఆ ఇంటిని కబ్జా చేయించారు.

చివరికి సుమశ్రీ కూతురితో ప్రాణాలు పోతున్నాయి నాన్న అని ఒక వీడియో రికార్డు చేసి పంపించినా కర్కోటకుడికి మనసు కరగకపోవడంతో అరకొర వైద్యం మాత్రమే అందుతూ సాయిశ్రీ ప్రాణాలు కోల్పోయింది. ఒక బంధాన్ని ఏర్పరుచుకొనే ముందు దాన్ని నిలబెట్టుకొనే శక్తి, ధైర్యం కనీసం ఉండాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడాల్సిన వాళ్ళే చేతులు దులుపుకొనే పరిస్థితి రావడం అనేది నిజంగా హేయనీయం. నన్ను కాపాడు నాన్నా అంటూ ఆ చిన్నారి వేడుకోలు చూస్తున్న పాషాణ హృదయాలకైనా కంటతడి పెట్టిస్తుందే… అలాంటిది తన సొంత తండ్రిని మార్చలేకపోయిందా…..

Have something to add? Share it in the comments

Your email address will not be published.