పదహారేళ్ళకే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ‘స్ఫూర్తి’

A 16 year old Hyderabadi Singer Spoorthi enters into bollywood with Bache Kache Sache
 A 16 year old Hyderabadi Singer Spoorthi enters into bollywood with Bache Kache Sache
ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్వరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అడ్డుండదని నిరూపించింది పదహారేళ్ళ స్ఫూర్తి. చిన్న వయసులోనే పాటలు పాడడంపై ఉన్న ఆసక్తిని గమనించి ఎంకరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లో పాట పాడే స్థాయికి చేరుకుంది ఈ చిన్నారి.  వేడుక, యమహో యమవంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు జితేంధర్. వై. కుమార్తె ‘స్ఫూర్తి జితేందర్’.
పదకొండేళ్ళ వయసులోనే తండ్రి దర్శకత్వం వహించిన యమహో యమ సినిమాలో సంగీత దర్శకుడు భోలే సారధ్యంలో ఐటెం సాంగ్ పాడి, శభాష్ అనిపించుకున్న స్ఫూర్తి ఆ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం లో థమన్ సంగీత సారధ్యం లో, రవి తేజ హీరో గా కిక్-2, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘లోఫర్’ సినిమాలో సునీల్ కశ్యప్ సంగీత సారధ్యంలో పాటలు పాడి తన గాత్రాన్ని అందరికీ వినిపించింది.
అంతేగాక గతేడాది  కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘ఇజమ్’ సినిమాలోనూ అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యం లో గానం చేసి 16సంవత్సరాలకే ఆశిష్ విద్యార్థి, ముకేష్ తివారి తదితరులు నటించిన, రవి సదాశివ దర్శకత్వంలో రూపొందిన “బచ్చె, కచ్చె .. సచ్చె .. ” అనే హిందీ చిత్రం లో అమితాబ్ నటించిన సర్కార్ 3 చిత్రానికి సంగీతం అందించిన రవి శంకర్ మరియు భోలే ల సంగీత సారధ్యం లో గానం చేయడం ద్వారా తెలుగు అమ్మాయి బాలీవుడ్ చిత్రానికి గానం చేయటం చెప్పుకోదగ్గది. బాలల చిత్రం గా సమాజానికి సందేశాన్ని అందించే ఈ చిత్రం జూన్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది.
ప్రముఖ బాలీవుడ్ గాయకులు జావేద్ అలీ , Md . ఇఫ్రాన్ లు గానం చేసిన చిత్రం లో తను టైటిల్ ట్రాక్ పాటను గానం చేయడం తన అదృష్టాంగా భావిస్తున్నాను అని స్ఫూర్తి చెబుతోంది. అంతేగాక మానవతా విలువలతో పిల్లలపై పెద్దల ప్రవర్తన నేటి సమాజంలో ఏ విధంగా ఉండాలి అని సందేశాత్మకంగా  చైతన్యాన్ని తీసుకొచ్చే సందేశాత్మక చిత్రం గా రూపొంది గాయని గా తనకి సరైన గుర్తింపు తెచ్చే బాలీవుడ్ లో అవకాశంగా భావిస్తున్నానంటోంది స్ఫూర్తి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.