కర్నూలులో రాజకీయ హత్య

A group killed YSRCP incharge in Kurnool distict like Faction murder

A group killed YSRCP incharge in Kurnool distict like Faction murder

రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు మళ్ళీ మొదలయ్యాయి. ఇన్నేళ్ళు రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ హత్యలు లేవని అందరూ అనుకుంటుంటే మళ్ళీ ఒక రాజకీయ హత్య తెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డిపై ప్రత్యర్థులు కొందరు, బాంబులు, కత్తులతో దాడికి పాల్పడ్డారు.

ఆదివారం ఉదయం నారాయణరెడ్డి నంద్యాలలో సూర‍్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి అలాగే వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లెలో హనుమంతు కుమారుడు రమేశ్‌ పెళ్ళికి హాజరయ్యారు. ఆ తర్వాత ఉదయం 11గంటల 30నిమిషాలకు కారులో స‍్వగ్రామానికి వస‍్తుండగా కృష‍్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులో కల‍్వర్టు దగ్గర కాపు కాసిన ప్రత్యర్థులు తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీ కొట్టించారు. ఆ తర్వాత పెళ్లికి వెళ్లొస్తున్న నారాయణరెడ్డి కారుపై తొలుత బాంబులు వేసి అనంతరం చాలా విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారు. నారాయణరెడ్డి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని తెలుసుకున్న తర్వాతే ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రణాళిక వేసి ఈ హత్య చేశారు.

ఈ దాడిలో ఆయనకు కీలక అనుచరుడిగా ఉన్న సాంబశివుడుని కూడా చంపేశారు. తనకు ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని కొద్ది రోజుల కిందటే తన లైసెన్స్‌ ఆయుధాన్ని తిరిగి కొనసాగించేందుకు అనుమతికోసం పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించక పోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అనుకుంటున్నారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.