సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విమానంలో భోజనం

A Man buys lunch for soldiers on board and you wont believe what happens next

A Man buys lunch for soldiers on board and you wont believe what happens next

విమానంలో భోజనం

విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీకి ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం, ఒక గంట నిద్ర పోవడం — ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు. అన్నీ నిండి పోయాయి. కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను.
“ఎక్కడకి వెడుతున్నారు?” అని.

” ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు” అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి

” మనం కూడా లంచ్ చేద్దామా ?” అడిగాడు ఆ సైనికులలో ఒకరు
” వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
” సరే ! ”
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో ” వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. ” అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

” ఆమె కళ్ళల్లో నీరు ” నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! ” అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం…
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి…
నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది…
మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
” మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు .”
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
అతడు షేక్ హేండ్ ఇస్తూ ” నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను ” అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు.

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ ” మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! ” అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెళుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
” బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు ”

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !

 

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి. ఈ భరత మాత ముద్దు బిడ్డలను గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
– జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

** ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలాకాలంగా షికార్లు చేస్తున్న సందేశం. (Sarbjeet Singh Bobby గారి పోస్టు అనువాదం)
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం ! సకలం ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మరోసారి మీ వద్దకు తీసుకొచ్చాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.