మాతృత్వానికే మచ్చ తెచ్చిన ‘పైశాచిక తల్లి’

A Psycho Mother burns 8 year old boy's private parts in Hyderabad

A Psycho Mother burns 8 year old boy's private parts in Hyderabad

మాతృత్వమనేది ఎంతో గొప్పదైన అనుభూతి. అమ్మ అంటే లాభాపేక్షలేని ప్రేమకు ప్రతీక . కానీ, ఆ మాతృత్వానికే తమ విక‌త చేష్టలతో మచ్చ తెస్తున్నారు కొందరు మహిళలు. ఆడపిల్ల పుట్టిందని ముళ్ళపొదల్లో కొందరు పడేస్తున్నారనే వార్తలు మనం వింటూనే ఉంటాం. అయితే హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన అమ్మతనానికే తలవంపులు తెచ్చింది. తన ఇష్టప్రకారం నడుచుకోనివ్వట్లేదనే కారణంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అంతేగాక మొగుడ్ని ఇంటినుండి బయటికి వెళ్ళగొట్టి ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలతో పైశాచికంగా ప్రవర్తించి ఆనందించిన ఓ మహాతల్లి కథ ఇది.

సంగారెడ్డిలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణకి 2005లో అనూష‌ అనే మహిళతో పెళ్ళైంది. ఆ తర్వాత కొన్నేళ్ళపాటు బాగానే ఉన్న అనూష మహిళా మండలిలో పనిచేస్తుంది. అయితే మహిళామండలిలో పనిచేయొద్దని భర్త ఎంతచెప్పినా వినకుండా తన ఇష్టం వచ్చినట్లు తాను ప్రవర్తిస్తూ ఉండడంతో భార్యాభర్తలిద్దరికీ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఆ పరిస్థితుల్లో అనూష మురళీకృష్ణనుండి విడాకులు కావాలని దరఖాస్తు చేసి భర్త మురళీకృష్ణను ఇంటినుండి వెళ్ళగొట్టి ఇద్దరు పిల్లలను తనే చూసుకోవడం మొదలుపెట్టింది.

ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నన్పటికీ భర్తను ఇంటినుండి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఆ తల్లిలో వచ్చిన మార్పులు పిల్లలపై ప్రభావం చూపించడం మొదలైంది. మాటికి పిల్లలను చీదరించుకోవడం, వారిని ఇష్టం వచ్చినట్లు చిత్రహింసలు పెట్టడం, పిల్లలు అని ఏమాత్రం చూడకుండా వాళ్ళతో అడ్డమైన పనులు చేయించేదని పిల్లలు వాపోతున్నారు. ఆఖరికి తల్లితనానికే మచ్చ తెచ్చేలా ప్రవరిస్తూ తన మూత్రం కూడా పిల్లలకు త్రాగించి ఘనత కీర్తి సంపాదించుకున్న ఈ మహాతల్లి అనుష తన పైశాచికత్వాన్ని బయటపెట్టేదని పిల్లలు చెబుతున్నారు.

అంతేగాక పిల్లల చేత ఇంటిపనులు చేయిస్తూ ఒకవేళ చేయనని మొండికేస్తే తన ఇష్టం వచ్చిన తీరులో గంటెలతో పిల్లలకు ఎక్కడపడితే అక్కడ వాతలు పెట్టడమేకాకుండా ఆఖరికి 8 సంవత్సరాల హర్షవర్ధన్ మర్మాంగంపై గరిటతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో ఈ రాక్షస ఆక‌త్యాలనుండి తమను బయటపడేయమని తండ్రి మురళీకృష్ణకు జరిగిన మొత్తం విషయాలు చెప్పడంతో ఆ తండ్రి పిల్లలతో కలిసి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించాడు…కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.