మనుషులకు అయిపోయింది… ఇప్పుడు గోవుల వంతు

Aadhaar-like unique identification numbers for cows to check smuggling

Aadhaar-like unique identification numbers for cows to check smuggling

ఇన్ని రోజులు దేశంలో ఏ పథకానికైనా ఆఖరికి ఒక మొబైల్ నెంబరు తీసుకోవాలన్నా అన్నింటికి కీలకమైన గుర్తింపుకార్డు ఏదైనా ఉందా అంటే అది ఆధార్ కార్డే. ఇప్పుడు మనుషులకు ఉన్నట్లుగానే గోవులకు కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను కేటాయించనుంది కేంద్రప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఎన్ని గోవులు ఉన్నాయి.. వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటి.. అవి ఎక్కడికి తరలిపోతున్నాయి.. అనే సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురానుంది.

దేశంలో జరుగుతన్న గోవుల అక్రమ రవాణాపై దృష్టి పెట్టిన కేంద్రం వాటిలెక్క తేల్చే పనిలో పడింది. గోవుల సంఖ్యను గుర్తించేందుకు గాను దాని చెవి భాగంలో 12 అంకెలతో కూడిన యూఐడీ ట్యాగ్‌ను అంటించనున్నట్లు జంతు సంరక్షణ శాఖ అధికారులు తెలిపారు. దాదాపు లక్ష మంది నిపుణులు 50,000 ట్యాబ్లెట్‌లతో దేశ వ్యాప్తంగా గోవుల సంఖ్యను లెక్కకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

పసుపు పచ్చ రంగులో ఉండే యూఐడీ ట్యాగ్‌ను గోవులకు చెవి లోపలిభాగంలో అంటించనున్నారు. ట్యాగ్ దానికి ఫిక్స్ చేశాక.. దాని సంఖ్య, యజమాని వివరాలు, గోవుకు అందించే టీకాలు, ఫీడింగ్ తదితర వివరాలన్నీ ట్యాబ్ సాయంతో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు. గోవుల సంరక్షణ కోసం ‘యజమానికి హెల్త్ కార్డు’ కూడా ఇవ్వనున్నారు.

గోవులకు యూఐడీ మాత్రమే కాకుండా లేగదూడల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చేపట్టనుంది. గుర్తింపు నెంబర్ ద్వారా గోవులకు సరైన సమయంలో టీకాలు ఇవ్వడం వల్ల వాటి సంరక్షణ సులువవుతుంది. అంతేగాక  ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఓ పథకం తీసుకురావాలని యోచిస్తుంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.