ఆధార్ లేకుంటే విమానం టికెట్లకు నో…

Aadhaar to become mandatory for board domestic flights in India

Aadhaar to become mandatory for board domestic flights in India

శివసేన ఎంపీ గైక్వాడ్‌లాంటి మహానుభావుల పుణ్యమా అని మన దేశంలో విమానయానంలో నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. బోర్డింగ్ పాస్ తీసుకొనే దగ్గరినుండి ఫ్లైట్ దిగి ఎయిర్‌పోర్ట్ నుండి బయటికి వెళ్ళేవరకు ఏదో ఒక సందర్భంలో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, గొడవలు పెట్టుకోవడం, సిబ్బందిపై దాడులు చేయడంవంటి సంఘటనలు దేశంలో ఏదో ఒక మూల ప్రతీ రోజు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో సిబ్బందికి చేదు అనుభవాలు ఎదురవకుండా చూసుకొనే ప్రణాళికకు రంగం సిద్ధమైంది.

అందులోభాగంగా డొమెస్టిక్ విమాన టిక్కెట్లకు సైతం ఇకపై ఆధార్‌ తప్పనిసరి చేయనున్నారు. దురుసుగా వ్యవహరించే ప్రయాణికులు దేశీయ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించేందుకు కొత్తగా ‘నిషేధ జాబితా’ను రూపొందించాలని డీజీసీఎ నిర్ణయించింది.అందులోభాగంగా ప్రయాణాల్లో ఒకసారి ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిని గుర్తించడానికి వీలుగా టికెట్లు కొనే సమయంలోనే ఆధార్‌ నంబర్‌నుగానీ, పాస్‌పోర్టునుగానీ తప్పనిసరి చేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) భావిస్తోంది. ఈ నిబంధనగనక అమలులోకి వస్తే ఒకవైపు దురుసుగా వ్యవహరించే వ్యక్తులపై నిఘా ఉంచడమేకాకుండా ముఖ్యంగా దేశీయంగా ప్యాసింజర్ల ప్రయాణాలపై నిఘా కూడా ఉంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేగాక ఒక ఏడాదిలో ఒక ప్రయాణికుడు ఎన్నిసార్లు విమానం ఎక్కుతున్నాడనే లెక్క కూడా చాలా ఈజీగా తీసుకొనే అవకాశం ఉంటుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.