ఆది పినిశెట్టి కొత్త సినిమా షురూ

aadi-pinisetty-ks-ravi-kumar-chowdary-latest-movie-project-going-to-start-in-rugveda-creations-banner

 

aadi-pinisetty-ks-ravi-kumar-chowdary-latest-movie-project-going-to-start-in-rugveda-creations-banner

 

య‌జ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో , ”ఒక విచిత్రం ‘  సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి, స‌రైనోడు, మ‌లుపు స‌హా ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి హీరోగా ఓ కొత్త సినిమా  తెరకెక్కడానికి రెడీ అవుతోంది.

రుగ్వేద క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  ప్ర‌ముఖ నిర్మాత డి.ఎస్‌.రావు  నిర్మాణ బాధ్య‌త‌లు వహిస్తున్నఈ కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

‘ల‌వ్‌, కామెడి, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. ‘డిఫ‌రెంట్ క‌థ‌ ఇది .ఆది పినిశెట్టి స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తాడు.  ఆది కెరీర్‌లో మ‌రో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌చేస్తాం” అని ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు.

    

Have something to add? Share it in the comments

Your email address will not be published.