సమస్యలను ఎదుర్కొనే ‘ఆకతాయి’

ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా వి.కె.ఎ.ఫిలింస్ బ్యాన‌ర్‌పై రామ్‌భీమ‌న ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `ఆక‌తాయి`. ఈ సినిమా మార్చి 10న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో ఆశిష్ రాజ్‌ మీడిియాతో తన సినిమా అనుభవాలను పంచుకున్నాడు. హీరో ఆశిష్ రాజ్ మాటల్లోనే..

‘ నేను పుట్టి పెరిగిందంతా హైద‌రాబాద్‌లోనే. థియేట‌ర్స్ ఆర్ట్స్‌లో కోర్సు చేశాను. ఆ స‌మ‌యంలోనే మోడ‌లింగ్ చేయ‌డం ప్రారంభించాను. అలాగే కొన్ని షార్ట్ ఫిలింస్‌లో కూడా యాక్ట్ చేశాను. ఆక‌తాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాను. కొన్ని యాడ్స్ కోసం ముంబై వెళ్ళిన‌ప్పుడు అక్క‌డ డైరెక్ట‌ర్ రామ్‌భీమ‌న‌గారిని క‌లిశాను. ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో హీరోగా చేయాల‌ని ఆలోచ‌నలో ఉండ‌గానే, ఆయ‌నే హీరోగా నువ్వు చెయ్యెచ్చు క‌దా అన్నారు. ముందు కాస్తా ఆలోచించాను కానీ..చివ‌ర‌కు హీరోగా చేయాల‌నుకున్నాను. షూటింగ్ ముందుగా డ్యాన్స్‌, ఫైట్స్ ఇలా అన్నింటిలో ట్ర‌యినింగ్ తీసుకున్నాను.

ఈ సినిమాలో కాలేజ్ చ‌దివే ఆక‌తాయి కుర్రాడి పాత్ర‌. కాలేజ్ చ‌దివే స‌మ‌యంలోనే త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని ప్రేమిస్తాడు. లైఫ్ ఆనందంగా సాగే సమయంలో కుర్రాడికి కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దాని వ‌ల్ల ఆ అబ్బాయి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేశాడ‌నేదే క‌థ‌. ప్రేక్ష‌కులు కోరుకునే ఎలిమెంట్స్‌తో ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే సినిమా. రుక్ష‌ర్ చాలా మంచి కోస్టార్‌. అంద‌మైన అమ్మాయే కాదు..తెలివైంది కూడా. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే, త‌ను నా కాలేజ్‌మేట్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఏదో గ్లామ‌ర్ ప‌రంగానో, పాట‌ల‌క‌నో స‌రిపెట్టేలా త‌న పాత్ర ఉండ‌దు. హీరోకు స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ఆమె త‌న‌కు ఎలా అండ‌గా నిల‌బడింద‌నేదే క‌థ‌. డైరెక్ట‌ర్ రామ్‌భీమ‌న‌గారు లండ‌న్‌లో డైరెక్ష‌న్ కోర్సు చేశారు. త‌ను ఏం చేయాలనుకున్నాడో దానిపై పూర్తి అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తి. క‌థ‌ను రెండున్న‌ర గంట‌ల‌పాటు అద్భుతంగా నెరేట్ చేశారు. ఎంత బాగా చెప్పారో..అంత కంటే బాగా స్క్రీన్‌పై ప్రెజంట్ చేశారు.’ అంటూ ముగించాడు ఆశిష్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.