జగదీశ్వర్‌‌రెడ్డి ఇంట్లో ఎసిబి సోదాలు

 

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జగదీశ్వర్‌రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు చెన్నై, విజయవాడ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ సహా ఎనిమిది ప్రాంతాల్లో ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జగదీశ్వర్‌రెడ్డి గత కొంతకాలంలో అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టారని సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.