వెంకన్నపై ఎసిబి దాడులు

ACB rides in Industries department Chief Inspector Venkanna Homes

ప్రభుత్వ ఉద్యోగులు ఒకరి తర్వాత ఒకరి బండారం బయటపెడుతోంది అవినీతి నిరోధకశాఖ. ఈమధ్య అవినీతి జలగల పనిపడ్తున్న ఎసిబి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో పరిశ్రమలశాఖ చీఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న ఇంటిపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు.

ACB rides in Industries department Chief Inspector Venkanna Homes

అవినీతి నిరోధకశాఖ వలలో మరో అవినీతి అధికారి పడ్డారు. ఈరోజు ఉదయం మొత్తం 12 బృందాలు ఏకకాలంలో దాడులు ప్రారంభించి వెంకన్న ఇంటితోపాటు అతని బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్ లోని ఆయన నివాసంలో 2.45 లక్షల రూపాయల నగదు, భూమిపత్రాలు, బంగారం ఉన్నట్లు గుర్తించారు.

See Also: ఇంత దారుణమా??

అంతేగాక ఆయన భార్య పేరు మీద‌ పది బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తేల్చారు. మియాపూర్ లోని 5 కోట్ల రూపాయల విలువైన ఇళ్లు వెంకన్న పేరు మీద ఉందని అవినీతి నిరోధక శాఖ అధికారులు గురర్తించారు. అంతేగాక మియాపూర్ లోని కృషినగర్, మాసబ్ ట్యాంక్ లోని పరిశ్రమలశాఖ కార్యాలయం, సూర్యాపేట, నిజామాబాద్‌ల్లో ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.