నోటీసులు వచ్చిన మాట నిజమే – నేనేం తప్పు చేయలేదు

Actor Navdeep gets notices in Drugs case and denies the involvement

టాలీవుడ్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. అయితే తమకు ఎలాంటి సంబంధంలేకున్నా తమ పేర్లు బయటపెట్టడాన్ని కొంతమంది తప్పుబడుతుంటే మరికొంతమంది నోటీసులు అందిన మాటను ఒప్పుకుంటున్నారు.

Actor Navdeep gets notices in Drugs case and denies the involvement

సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని, పోలీసుల విచారణలో పూర్తిగా సహకరిస్తానని చెబుతున్నాడు టాలీవుడ్ హీరో నవదీప్. నోటీసులు వచ్చిన మాట నిజమే కానీ తాను ఏ తప్పు చేయలేదని, అకారణంగా ఊహాగానాలతో తమ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని బాధపడుతున్నాడు. అంతేగాక కెల్విన్‌తో సంబంధాలు అంటున్నారని, కానీ ఆ కెల్విన్ ఎవరో తనకు నిజంగానే తెలియదని ఈ డ్రగ్స్ కేసులో మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడంతో తమకు చాలా ఇబ్బందికరంగా మారిందని నవదీప్ అంటున్నాడు.

See Also: డర్టీ పిక్చర్ : డ్రగ్స్ కేసులో బయటపడుతున్నమేకప్

అంతేగాక చిన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే నా జీవితం సాఫ్ట్ టార్గెట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లాంటి విషయాల్లో తప్పులు చేసి సరిదిద్దుకున్నానని, కానీ డ్రగ్స్‌లాంటి పెద్ద కేసుల్లో ఇప్పటివరకు తనపై కనీసం ఆరోపణలు కూడా రాలేదన్న విషయం అందరికీ తెలుసన్నారు నవదీప్. అయితే ఇటీవల ఓ రాంగ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో కలిసి పని చేయడంవల్లే తనను పిలిచి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. అంతేగాక జనరల్ కౌన్సెలింగ్ కోసం నోటీసులు అందజేశారని విచారణకు సహకరించి పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇంటికి వస్తానన్నారు నవదీప్. అప్పటివరకు అనవసర ప్రచారం చేసి తమను ఇబ్బంది పెట్టొదని అందరినీ కోరాడు నవదీప్.

See Also: 15మంది నటీనటులపై అల్లు అరవింద్ సీరియస్

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.