సుబ్బరాజు ఏం చెప్పాడంటే…

Actor Subbaraju attends the SIT inquiry and reveals crucial information

డ్రగ్స్ కేసులో కొత్త కోణాల కోసం అన్వేషిస్తున్న సిట్‌‌కు కీలక విషయాలు బయటపడుతున్నాయి. మూడు రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి డ్రగ్స్ కేసులో ఇరుక్కొని నోటీసులు అందుకున్న సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా సిట్ ముందు హాజరవుతున్నారు. మొన్న పూరీ జగన్నాధ్, నిన్న శ్యాం కే నాయుడిని విచారించిన సిట్ ఈరోజు ఆర్టిస్ట్ సుబ్బరాజును లోతుగా విచారిస్తోంది.

Actor Subbaraju attends the SIT inquiry and reveals crucial information

డ్రగ్స్‌ మాఫియా కేసులో మూడోరోజు కూడా సిట్‌ విచారణ సాయంత్రం 06గంటల 30 నిమిషాలకు కూడా ఇంకా కొనసాగుతోంది. ఇంకా రెండు మూడు గంటలు పట్టే అవకాశం ఉందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌ సభర్వాల్ తెలిపారు. నోటీసు అందుకున్న సుబ్బరాజు విచారణ కోసం ఈరోజు ఉదయం ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.

డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్‌ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్‌ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సుబ్బరాజు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న అధికారులు… విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. మొత్తం ఈరోజు సిట్‌ అధికారులు సుమారు ఏడు గంటలకు పైగా సుబ్బరాజుని విచారణ చేశారు.

సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని, సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయని స్పష్టంచేశారు ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌. డ్రగ్స్‌ కేసులో లోతుగా విచారణ చేయాల్సి ఉందని, ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియాతో టాలీవుడ్‌ లింకులపై ఆధారాలు లభిస్తున్నాయని, అంతేగాక నోటీసులు అందుకున్న ముమైత్‌ఖాన్‌, ఛార్మీలు కూడా విచారణకు హాజరు అవుతారని చంద్రవదన్ స్పష్టంచేశారు.

See Also: పంచ్‌లు వేసే పూరీకే సిట్ పంచ్‌లు

మరోవైపు సుబ్బరాజు సాంపిల్స్ కోసం ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నోటీసులు అందుకున్న నటుడు తరుణ్‌ సిట్‌ ఎదుట శనివారం హాజరు కానున్నారు. అంతేగాక రేపు ఉదయం 11గంటలకు బార్లు, పబ్స్ యజమానులను, మేనేజర్లను సిట్ ఎదుట హాజరుకావాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌ సభర్వాల్ స్పష్టంచేశారు. ముమైత్‌ ఖాన్ నోటీసుల్లో కేటాయించిన 27తేదీననే హాజరవుతారని అకున్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.