పెద్ద మనసు చూపిస్తున్న “తమిళ హీరోలు”

Actor Vishal New way to help One rupee from each movie ticket will go to Farmers

Actor Vishal New way to help One rupee from each movie ticket will go to Farmers

మొన్న డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ రైతులకు అండగా ఉంటానని ముందుకి వస్తే , నేడు తమిళ స్టార్ హీరో తెలుగు బిడ్డ విశాల్ ముందుకొచ్చాడు. రైతుల కష్టాలపై చలిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు విశాల్. అందులోభాగంగా తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాల్లొో పాల్గొంటున్న విశాల్ మరో అడుగు వేసి తమిళ రైతులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటినుండి విడుదలైన ప్రతీ సినిమా టికెట్‌పై ఒక రూపాయిని రైతులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించాడు. సినిమా టికెట్టు ధరలో నిర్మాతలవంతుగా ఒక రూపాయి రైతులకు అందించనున్నారు. అయితే ప్రతీరోజు ప్రతీ టికెట్‌పైకాకుండా తమిళనాడులో విడుదలైన అన్ని సినిమాల్లో ఏదో ఒకరోజు ప్రతి టికెట్‌పై ఒక రూపాయిని రైతు నిధికి కేటాయించనున్నారు. ఏరోజు వసూలు చేయాలో ఆతేదీని త్వరలోనే ప్రకటించి వచ్చిన డబ్బులను ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి ఇస్తామని చెబుతున్నాడు విశాల్.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.