తమిళనాడులో కుట్ర జరుగుతోందన్న కుష్బూ

Actress Kushboo fires on BJP in Tamilnadu state politics issue

Actress Kushboo fires on BJP in Tamilnadu state politics issue

తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు జరగుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  శశికళ, దినకరన్‌లను ఎఐఎడిఎంకెనుండి బయటికి పంపించిన తర్వాత పళనిస్వామి వర్గం పన్నీర్ సెల్వం వర్గానికి మధ్య సయోధ్య జరుగుతున్న నేపథ్యంలో బిజెపి తమ రాజకీయ భవిష్యత్తు కోసం అన్నా డీఎంకెతో పొత్తు ఏర్పాటు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదంటున్నారు  సినీ నటి, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి కుష్బూ .

తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని ఆరోపించిన కుష్బూ ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి మాట్లాడారు. దొడ్డిదారిన ప్రవేశించేందుకు బీజేపీ ప్రయత్నిస్తే, అది కలగానే మిగిలిపోతుందని కచ్చితంగా చెప్పగలనన్నారు.

మరోవైపు బీజేపీ కలలు ఫలించవని డీఎంకె ప్రధానకార్యదర్శి దురైమురుగన్‌ స్పష్టంచేశారు. రాష్ట్ర రైతుల 19 డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ డీఎంకే తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ విజయవంతమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ డీఎంకేపై, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై అనుచిత ప్రకటనలు చేస్తున్నట్లు విమర్శించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.