మూడు ప్రాజెక్టులతో బిజీ అయిన సమంత

Actress Samantha become busy with movie projects and Handloom promotions

Actress Samantha become busy with movie projects and Handloom promotions

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సమంత జనతా గ్యారేజ్ మూవీ తర్వాత తెలుగు సినిమాలను ఓకే చేసేందుకు కాస్త టైం తీసుకుంది. ఒక వైపు వరుస తమిళ సినిమాలకు సైన్ చేస్తున్నా తెలుగు సినిమాలను పెండింగ్ లో పెట్టుకుంటూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కొన్ని తెలుగు ప్రాజెక్టులు ఉండగా , ఇందులో సామ్ చేస్తున్న పాత్రలు వేటికవే ప్రత్యేకంగా ఉండనున్నాయి.

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుండగా, మరో వారం రోజులలో తొలి షెడ్యూల్ పూర్తి కానుందని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో సమంత పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్.

సమంత తెలుగులో చేయబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మహానటి. సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నాగ అశ్విన్ తెరకెక్కించనుండగా ఇందులో కీర్తి సురేష్‌ టైటిల్ రోల్ ప్లే చేయనుంది. సమంత జమున పాత్రలో కనిపించనుందని ఇటీవల గాసిప్స్ వచ్చాయి. అయితే  లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ చిత్రంలో సమంత పాత్ర నేటి తరం జర్నలిస్టుగా ఉంటుందని.. ఈమె సావిత్రి జీవితం గురించి సాగించే పరిశోధన చేస్తుందని అంటున్నారు. దర్శకుడు అశ్విన్ సావిత్రి పాత్రను ఈ విధంగా రాసుకున్నాడని తెలుస్తుంది.

ఇక నాగార్జున నటిస్తున్న రాజుగారి గది 2 సీక్వెల్ లోను సమంత ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుందట. ఏదేమైన ఈ మూడు చిత్రాలలో సమంత చేస్తున్న రోల్స్ అభిమానులకి ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు మూవీపై హోప్స్ పెంచుతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.