జర్నలిస్టుగా సమంత

Actress Samantha playing a key role as Journalist in Naga Ashwins Mahanati with Keerthi Suresh

Actress Samantha playing a key role as Journalist in Naga Ashwins Mahanati with Keerthi Suresh

మహానటి సావిత్రి జీవిత ఘటనల ఆధారంగా ఎవడే సుబ్రమణ్యంతో పరిచయమైన డైరక్టర్ నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తుతున్న సినిమాలో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేశ్‌, సమంత పేర్లు ప్రకటించినప్పటి నుంచి సావిత్రి పాత్రలో ఏ ముద్దుగుమ్మ కనిపించనుందోనన్న సస్పెన్స్‌కు తెరపడనుంది.

ఫిలిం సర్కిళ్ళలో వినిపిస్తున్నగుసగుసల ప్రకారం ఈ సినిమాలో సావిత్రి ఎవరో తేల్చేశారు. సమంత ఈ చిత్రంలో ఓ జర్నలిస్టు పాత్రలోనూ.. కీర్తి సురేశ్‌ సావిత్రిగానూ కన్పించబోతున్నారట. సమంత పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. ఈ పాత్ర కోణంలోంచే సినిమా కథ మొత్తాన్ని చూపిస్తారని అంటున్నారు. దీంతో సమంత జర్నలిస్టు పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌లో మాయాబజార్‌ చిత్రంలో సావిత్రి స్టిల్‌కు ఇరువైపులా సమంత, కీర్తి సురేశ్‌ ఉన్న ఈ పోస్టర్‌పై ‘తరాలను నిర్మించే స్త్రీజాతి కోసం.. తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ’ అని రాసి ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.