ఛార్మి తర్వాత ఇప్పుడు ఆ హీరోయినే

Actress Vithika Sheru following charmee foot steps in cancer Awareness

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మీ బాటలో ఇంకో హీరోయిన్ నడిచింది. కుటుంబ క‌ల‌హాల‌తో ఆత్మ‌హ‌త్యకి ప్రయత్నించిందని కొన్ని రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో హల్‌చల్ జరిగి చివరికి మీడియా ముందుకు వచ్చి అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చుకున్న హీరోయిన్ వితిక. వ‌రుణ్ సందేశ్ భార్య వితిక ఇప్పుడు ఛార్మి బాటలో నడవాలని డిసైడ్ అయి ఆ బాటలో నడుస్తోంది.

Actress Vithika Sheru following charmee foot steps in cancer Awareness

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మి ఒకప్పుడు క్యాన్సర్ బాధితులకోసం తన జుట్టుని విరాళంగా ఇచ్చింది. ఆమెకు ముందు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా జుట్టు ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పుడు ఛార్మీ, రేణూ దేశాయ్ నడిచిన బాటలోనే నడిచి వితిక మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్’గా మారింది.

అయితే తాజాగా వితిక చేసిన పనికి నెటిజన్లు తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాను ఎంతగానో ఇష్టపడి పెంచుకొన్న జట్టును కొంతమేరకు క్యాన్సర్‌ బాధితులకు కోసం విరాళంగా ఇచ్చారు. ఆహారం, డబ్బులాంటివి విరాళంగా ఇవ్వడం సాధారణంగా చాలామంది ఇచ్చేవే. అయితే ఏళ్ల తరబడి ఇష్టంగా పెంచుకున్న జుట్టును ఇవ్వడం కొంత ఇబ్బందికరమే అని వితిక చెబుతోంది. క్యాన్సర్‌ బాధితులను దృష్టిలో ఉంచుకొని,  సదుద్దేశంతో తల వెంట్రుకలను  క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అధ్యార్‌(చెన్నై)కు విరాళంగా ఇచ్చానని స్పష్టం చేసింది.

See Also: నేనేం స్టేట్‌మెంట్ ఇవ్వలేదు: పూరీ జగన్నాథ్

Have something to add? Share it in the comments

Your email address will not be published.