‘జై లవకుశ’ అంటున్న నివేథా థామస్

Afetr Rashi Khanna now Nivetha Thomos roped into NTR27 Jai Lavakusha produced by NTR Arts1

Afetr Rashi Khanna now Nivetha Thomos roped into NTR27 Jai Lavakusha produced by NTR Arts1

జెంటిల్మెన్ సినిమాలో నానితో తెలుగు తెరకు పరిచయమై మంచి ప్రాజెక్టులు పట్టుకున్న మళయాళ చిన్నది నివేథా థామస్. తమిళంలో పెద్ద సినిమాలు చేసిన నివేథ ప్రస్తుతం నానితో ప్రస్తుతం ‘నిన్ను కోరి’ చిత్రంలోను నివేదా ధామస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ జరుగుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా తర్వాత మరో సినిమాతో దూసుకెళ్తున్న నివేథ ప్రస్తుతం ఇంకో పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అదే ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం. ఈ సినిమాకి జై లవకుశ అనే టైటిల్ కన్ఫర్మ్ అవగా, ఈ మధ్యే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూడు విభిన్నపాత్రల్లో కనిపించే ఈ సినిమాలో మొదటి హీరోయిన్‌ రాఖి ఖన్నా అని కన్ ఫాం చేసిన చిత్ర యూనిట్ తాజాగా నివేదా థామస్ సెకండ్ హీరోయిన్ అంటూ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.