ఓడినా అందరి మనసులు గెలిచిన మీరాకుమార్

After defeat also Meira Kumar breaks a 50 years old record

ఏకగ్రీవం అవుతుందనుకున్న రాష్ట్రపతి ఎన్నికలో యుపిఎ తెరపైకి తీసుకొచ్చిన మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ రామ్‌నాథ్ కోవింద్ చేతుల్లో ఓడిపోయినప్పటికీ పోరాటస్ఫూర్థితో అందరి మనసులు గెలుచుకున్నారు. ఓడిపోతానని తెలిసినప్పటికీ కోవింద్‌కు నోటీగా ప్రచారం చేసి ఓడినప్పటికీ ఓటమిలోనూ 50ఏళ్ళనాటి రికార్డును బద్దలుగొట్టి కొత్త రికార్డును సృష్టించారు.

After defeat also Meira Kumar breaks a 50 years old record

దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో 65శాతానికి పైగా ఓట్లు సాధించారు. కోవింద్‌కు వచ్చిన ఓట్ల విలువ 7లక్షల 02వేల 44 కాగా.. మీరాకుమార్‌కు పోలైన ఓట్ల విలువ 3లక్షల 67వేల 314. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మీరాకుమార్ యాభై ఏళ్ళుగా  ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. 1967లో భారత మాజీ ప్రధానన్యాయమూర్తి కోకా సుబ్బారావు తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు.

See Also: రాజీనామా ఆమోదం – మాయావతి ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయా??

అయితే ఆ ఎన్నికల్లో జాకీర్‌ హుస్సేన్‌ గెలుపొంది భారత నాలుగవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పుడు జాకీర్‌కు 4.7లక్షల ఓట్లు రాగా.. సుబ్బారావుకు 3.63లక్షల ఓట్లు వచ్చాయి. సరిగ్గా 50ఏళ్ల తర్వాత మీరాకుమార్‌ ఆ రికార్డును బద్దలుకొట్టి.. 3.67లక్షల ఓట్లు సాధించారు. ఈమధ్యలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఎవరికీ అన్ని ఓట్లు రాకపోవడం విశేషం. 1967 ఎన్నికల్లో సుబ్బారావుకు 43శాతం ఓటు షేరు రాగా.. మీరాకుమార్‌కు కేవలం 34శాతమే దక్కింది. అయితే హర్యానా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో విపక్షాలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి కోవింద్‌ను గెలిపించాయి. సమాజ్‌వాదీ పార్టీలోనూ ములాయం వర్గం కోవింద్‌కే ఓటేసింది. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు ఎన్డీయేకు మద్దతివ్వడంతో కోవింద్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందారు.

See Also: 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌

మరోవైపు ఈ నెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈనెల 23న ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేయనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.