త్వరలో దాసరి బయోపిక్

after NTR now its turn for Dasari biopic in telugu film industry

భారత చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అంతా బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈమధ్య వచ్చిన ఎంఎస్ ధోని, సచిన్‌ల బయోపిక్‌లు రికార్డులు క్రియేట్ చేస్తే, ప్రముఖ సెన్సేషనల్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని ప్రకటించి పెద్ద చర్చకే తెరలేపారు. ఆర్జీవీ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని ప్రకటించిన తర్వాత ఇప్పుడు మరో కొత్త ప్రకటన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చకు కారణమైంది.

after NTR now its turn for Dasari biopic in telugu film industry

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దాసరి నారాయణరావు. అనారోగ్యంతో ఇటీవల మరణించిన దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం ఆధారంగా ఆయన బయోపిక్‌ను సినిమా రూపంలో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నటుడు, ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కళ్యాణ్ దాసరి బయోపిక్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ప్రకటించారు.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

అంతేగాక దాసరి నారాయణరావు శిష్యుల్లోని ఓ ప్రముఖ దర్శకుడు ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే తమ గురువుగారికి తానిస్తున్న ఘననివాళి అని ప్రకటించారు ఓ.కళ్యాణ్. ఈ సినిమాతో దాసరి సినీ రాజకీయ జీవితాన్ని ప్రస్థావించనున్నారు. ఆ సాధించిన విజయాలు, ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

See Also: వర్మ ఇప్పుడేం వివాదాలు బయటపెడ్తాడో..!

Have something to add? Share it in the comments

Your email address will not be published.