కోచ్ పదవికి రవిశాస్త్రి తర్వాత వెంకటేశ్ ప్రసాద్ దరఖాస్తు

After Ravi Shastri Venkatesh Prasad Also applies To Coach position

అనిల్‌కుంబ్లే తర్వాత టీం ఇండియాకు రాబోయే కొత్త కోచ్‌పై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి పోటీ పెరిగుతోంది. బీసీసీఐ కొత్త కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన తర్వాత ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డ గణేష్, రవిశాస్త్రిలు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.

After Ravi Shastri Venkatesh Prasad Also applies To Coach position

తాజాగా టీమిండియా మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ రేసులోకి వచ్చారు. వెంకటేష్ ప్రసాద్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జూనియర్ నేషనల్ చీఫ్ సెలక్టర్‌గా పని చేస్తున్న వెంకటేష్ ప్రసాద్ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా తన మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. దీంతో టీం ఇండియాకు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు వెంకటేష్ ప్రసాద్ భారత్ తరఫున 33 టెస్టులు, 162 వన్డేలు ఆడాడు.

See Also: ఐపీఎల్‌కు ద్ర‌విడ్ గుడ్‌బై

రవిశాస్త్రి అనూహ్య నిర్ణయం వెనుక సచిన్ ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్… రవిశాస్త్రితో మాట్లాడి అతన్ని కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కోచ్ ఎంపికలో బీసీసీఐ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారినా.. వివిధ కోణాల్లో అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. బోర్డు పెద్దలందరూ కోహ్లీకి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తేలింది.

See Also: రవిశాస్త్రి దరఖాస్తు చేశాడోచ్

Have something to add? Share it in the comments

Your email address will not be published.