అగ్రి గోల్డ్ చైర్మన్ రామారావుకు గుండెపోటు

Agrigold chairman rama rao suffers cardiac stroke

Agrigold chairman rama rao suffers cardiac stroke

అమరావతి: ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించిన అగ్రి గోల్డ్ కంపెనీ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం రామారావు గుండెపోటుకు గురవ్వడంతో జైలు అధికారులు హుటాహుటీన ఏలూరులోకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థతి విషమంగా ఉండటంతో అధికారులు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

ప్రజల నుండి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలుచేసి ఎగవేశారనే ఆరోపణలపై రామారావు గత సంవత్సరం ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి హైదరాబాద్ లో ఆయనను అరెస్టు చేసి ఏలూరు జైలుకు తరలించారు. ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిని రామారావును హైకోర్టు ఆదేశాలు మేరకు సిఐడి అరెస్టు చేసింది.

బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత వారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం వేలంవేసి బాధితులకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.