పంచాయితీ తేల్చిన ఈసీ: రెండు గుర్తులు.. రెండు పేర్లు..

aiadmk-issueops-gets-electric-pole-symbol-ec-gives-auto-symbol-to-sasikala

aiadmk-issueops-gets-electric-pole-symbol-ec-gives-auto-symbol-to-sasikala

జయలలిత మృతితో రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే పార్టీ తమదంటే తమదని పోరాడుతున్న శశికళ, పన్నీరు సెల్వం వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పేరును ఎక్కడా వాడొద్దని ఇరువర్గాలకు ఎన్నికల సంఘం సూచించింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు తమదేనంటూ, తమకే కేటాయించాలంటూ శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

రెండు వర్గాల వాదనలు విన్న జాతీయ ఎన్నికల సంఘం  ఈ గుర్తును బ్లాక్ చేస్తున్నట్టు చెప్పింది. రెండాకుల గుర్తును పక్కనపెట్టి ఇతర గుర్తులు ఎంచుకోవాలని ఈ రెండు వర్గాలకు సూచించింది. పార్టీని కాకుండా ఇప్పుడు పార్టీ పేరును రెండు వర్గాలు పంచుకున్నాయి. పన్నీర్‌ సెల్వం వర్గం తమ పార్టీని ‘అన్నాడీఎంకే పురుచ్చి తలైవి అమ్మా’గా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించగా.. శశికళ వర్గం ‘అన్నాడీఎంకే అమ్మా’గా ప్రతిపాదించింది. శశికళ వర్గానికి ఆటో గుర్తు, పన్నీర్‌సెల్వం వర్వానికి రెండు విద్యుత్‌ స్తంభాల గుర్తును ఈసీ కేటాయించింది.

దీంతో మొత్తానికి గత కొంతకాలంగా వివాదాలకు కారణమైన ఈ విషయాన్ని ఈసీ తేల్చేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.