పట్టు సడలించని పన్నీర్.. ముందుకు కదలని విలీన ప్రక్రియ

AIADMK merger talks stalledPanneerselvam reiterates its stand

AIADMK merger talks stalledPanneerselvam reiterates its stand

తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతోందన్న ఆతృత రోజు రోజుకి ఎక్కువైపోతోంది. దినకరన్‌కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటినుండి మొదలైన రాజకీయ గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. శశికళ ద్వయాన్ని పక్కనపెట్టామని పళనిస్వామి వర్గం ప్రకటించినప్పుడు తర్వాత పన్నీర్, పళని వర్గాలు విలీనానికి ఇక వేరే అడ్డంకులు ఏవీలేవని అందరూ భావిస్తే అక్కడే అసలు రచ్చ మొదలైంది. రెండు వర్గాలు విలీనం అవ్వడానికి అవసరమైన అనుకూల వాతావరణాన్ని సమకూర్చుకోవడంలో రెండు వర్గాలు ముందుకు రాకపోవడం ఎవరికి వారు పంతాన్ని పట్టుకొని కూర్చోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా తయారైంది తమిళ రాజకీయ పరిస్థితి.

జయలలిత మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు.. శశికళ, ఆమె కుటుంబసభ్యులను పార్టీ నుంచి తొలగించేంత వరకు విలీన ప్రస్తావనే లేదని పన్నీర్‌ వర్గం పంతం పట్స్పటుకొని కూర్చుంది. అంతేగాక పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి  చేయాలనే నిబంధనలకు పళని స్వామి వర్గం ఒప్పుకోకపోవడంతోపాటు పార్టీ పత్రిక అయిన నమదు ఎంజీఆర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఇంకా పార్టీ వర్గాల నుంచి ప్రజల నుంచి మద్దతు ఉందంటూ కథనాలు రాయిస్తున్నారు. దీంతో పన్నీర్ వర్గం మంకుపట్టు పట్టుకొని కూర్చుంది. దీనికితోడు పన్నీర్‌కు ఆర్థిక శాఖ ఇస్తామని, పళనిస్వామి సీఎంగా కొనసాగుతారని పళని వర్గం తరఫున మంత్రి జయకుమార్‌ వ్యాఖ్యానించడంతో విలీన ప్రతిపాదనలో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది.

దీంతో జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు, శశికళ, దినకరన్‌తో పాటు వారి కుటుంబసభ్యులను పార్టీ నుంచి తొలగించేవరకు విలీనంపై ముందుకెళ్లేది లేదని విలీన ప్రక్రియపై స్పష్టత ఇచ్చేసింది పన్నీర్ గ్రూప్

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.