ఎంపీ గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేత

air-india-lifts-flying-ban-on-shiv-sena-mp-ravindra-gaikwad-in-chappal-slap-row

air-india-lifts-flying-ban-on-shiv-sena-mp-ravindra-gaikwad-in-chappal-slap-row

ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి చిక్కుల్లో పడ్డ  శివసేన ఎంపీ గైక్వాడ్‌పై ఎట్టకేలకు ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తివేసింది. గైక్వాడ్‌పై నిషేధానికి సంబంధించి గురువారం పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత గైక్వాడ్ పౌరవిమానయానశాఖకు రాసిన లేఖ సంతృప్తినిచ్చిందని అందువల్లే నిషేధాన్ని ఎత్తివేయాలని పౌరవిమానయానశాఖ ఎయిరిండియాకు లేక రాయడంతో నిర్ణయం తీసుకుంది. గత నెల 23న ఎయిరిండియా మేనేజర్‌ను వివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పుతో కొట్టిన తర్వాత ఏర్ప్పడ్డ గందరగోళానికి తెరపడ్డట్లైంది. మార్చి 23 తర్వాత విమానంలో ప్రయాణించడానికి ఇప్పటికే మూడుసార్లు పేరు మార్చుకున్న గైక్వాడ్కు చివరికి ఊరడింపు లభించింది.

ఎయిరిండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం పార్లమెంటులో మాట్లాడారు. తాను ఎవరిపైనా చేయిచేసుకోలేదనీ… ఎయిరిండియా ఉద్యోగులే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఆరోజు ఎయిరిండియా విమానంలో ఏంజరిగిందో మీడియాతో చెప్పుకొచ్చారు గైక్వాడ్. ”నిజానికి నేను కూర్చోవాల్సిన సీటును ఓ వృద్ధుడికి ఇచ్చాను. కానీ ఎయిరిండియా ఉద్యోగులు మాత్రం వేరే కథలు చెప్పారు. నాకు బిజినెస్ క్లాసులో సీటు ఉన్నప్పటికీ… నన్ను ఎకానమీ క్లాసులో కూర్చోబెట్టారు. ‘ఎంపీ అయితే ఏంటి? నువ్వేమైనా ప్రధాని మోడీవా?? అంటూ సిబ్బందే నన్ను అవమానించారు..” అని గైక్వాడ్ తెలిపారు. అయితే పౌరవిమానయానశాఖామంత్రి అశోక్‌గజపతిరాజుకి పశ్చాత్తాపాన్ని వ్యక్తంచేస్తూ రాసిన లేఖ చివరికి వర్కౌట్ అయ్యి ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.