ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం జీవో నెం.456 జారీచేసింది. ఇద్దరి సీఎస్‌ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఒకే జీవో జారీచేసింది. ఈ జీవో ప్రకారం, మంగళవారం (ఫిబ్రవరి 28) నుంచి మార్చి చివరి వరకు అజయ్ కల్లం సీఎస్‌గా ఉంటారు. మార్చి 31 నుంచి సీఎస్‌గా దినేష్‌ కుమార్‌ బాధ్యతలు చేపడుతారు.

అజయ్ కల్లం, దినేష్‌కుమార్‌ 1983 బ్యాచ్‌‌కి చెందిన ఐఏఎస్‌లే. దీంతో సీఎస్ రేసులో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిద్దరితో చర్చించి వారి మధ్య సఖ్యత కుదిర్చారు. అజయ్ కల్లం తరువాత రాష్ట్ర సీఎస్‌గా దినేశ్‌ను నియమిస్తామని హామీ ఇచ్చారు. అజయ్ కల్లం సీఎస్‌గా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. నెలరోజుల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కల్లం, రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.