అఖిల్ కొత్త సినిమా రెడీ

తమ వెనక వెన్ను తట్టి ఎంకరేజ్ చేసే గాడ్ ఫాదర్స్ ఉన్నా, సెలెబ్రిటీ ఫ్యామిలీకి చెందిన వారైనా ఒక్కొక్కరు ఎందుకో  ముందడుగు వేయలేరు. ముందుకు వెళ్లడానికి రకరకాల ఆటంకాలు ఎదురవుతుంటాయి. నిరాశా నిస్పృహలకు లోనవుతారు. చివరికి టైం కలిసొచ్చి ప్రొసీడ్ అవుతారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకు అఖిల్ ఫ్యూచర్ కూడా నిన్నటివరకు  అయోమయంలో ఉంది. చివరికి ఇప్పుడు బండి ఒక ట్రాక్ లో పడింది. అఖిల్ మూవీ స్టార్ట్ కాబోతోంది.

నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కాబోతోంది. నాగ్ కొడుకుగా ఇప్పటికే అఖిల్ ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉన్నా, అన్ని రకాలా సపోర్ట్ ఉన్నా అలా జరగలేదు. అందుకు మెయిన్ డ్రా బ్యాక్ అఖిల్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ కావడమే. దాంతో ఆశలు, అంచనాలు నీరుగారిపోయాయి. అతని సెకండ్ పిక్చర్  ప్రారంభానికి బ్రేకులు పడ్డాయి.

అఖిల్ రెండో సినిమాకోసం  ఏడాదిన్నరగా ఎన్నో  ప్రయత్నాలు  జరిగాయి. అప్పట్లో నాగార్జునకు టైం లేక కొంత ఆలస్యం జరిగింది. ఆ తర్వాత అఖిల్ కోసం కొన్ని కథలు వినడమూ జరిగింది. కొందరు డైరెక్టర్లు వారిని కలిశారు కూడా. ఏ డైరెక్టర్ తో చేయాలా అని చాలా డిస్కషన్స్ జరిగాయి.  కానీ ఏదీ గుడ్ రిజల్ట్  సాధించలేకపోయింది. మనం వంటి మూవీని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో అఖిల్ రెండో సినిమా స్టార్ట్ చేద్దామని నాగ్ అనుకున్నాడు.

అఖిల్ తో సినిమాకు  విక్రమ్ కుమార్ కొంతకాలం కిందట ప్లాన్ ఇచ్చాడు.  40 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇచ్చాడట. కానీ అంత బడ్జెట్ అవసరమా అని నాగ్ కొంత ఆలోచించాడు. అయితే .. .. మొత్తానికి  విక్రమ్ కుమార్ డైరెక్షన్ లోనే భారీ బడ్జెట్ తో  అఖిల్ సినిమా స్టార్ట్ కాబోతోంది. ఈ నెల 14న సంక్రాంతి రోజున హైదరాబాద్   అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభమవుతుంది.

ఇప్పటిదాకా ఎదురైన ఆటంకాలు తొలగిపోయి అఖిల్ పిక్చర్ కు లైన్ క్లియర్ అయింది. పూర్తి స్క్రిప్ట్ తో  విక్రమ్ కుమార్ రెడీగా వున్నాడట. కాబట్టి షూటింగ్ నిరాటంకంగా జరగవచ్చంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.