కాటమరాయుడు దూకుడు ఆపగలుగుతారా??

All India Cine goers wants to stall the Katamarayudu movie against steep hike and Sardar Distributor staging dharna

All India Cine goers wants to stall the Katamarayudu movie against steep hike and Sardar Distributor staging dharna

కాటమరాయుడు సినిమాను రెండు వారాల పాటు స్వచ్ఛందంగా బహిష్కరించాలని అఖిల భారత సినిమా ప్రేక్షకుల వినియోగ దారుల సంఘం కోరుతుంది.అయితే పవన్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ విషయం చేదుగానే వున్నప్పటికి ఆ సంఘం మాత్రం గట్టి నిర్ణయం తీసుకుంది.కాగా కాటమరాయుడు సినిమా పై ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణంఏంటి.ఇదే ఇప్పుడు చర్చనీయాంశం గా మారిన విషయం.
భారీ అంచనాలతో వచ్చిన సర్దార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డంగా పోవడంతో కాటమరాయుడు పై పవన్ తో పాటు అతని అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. సర్దార్ దెబ్బతో నష్టపోయిన పంపిణీ దారులకి కాటంరాయుడు న్యాయం చేస్తాను అని మాట అయితే ఇచ్చాడు కానీ నిజానిజాలు చూసుకుంటే మాట ఇచ్చినట్టు న్యాయం జరగలేదు . సర్దార్ సినిమా కొన్న వారిలో , లాస్ అయినవారి లో ఒక్కరికి కూడా కాటమరాయుడు సినిమా హక్కులు అమ్మలేదు. దీంతో సర్దార్ బాధితులు అందరూ నిరాహార దీక్ష కి దిగిన సంగతి తెలిసిందే.

Sardar Gabbar singh distributors staging dharna at Film Chamber
డిస్ట్రిబ్యూటర్ల దీక్ష ని పవన్ కళ్యాన్ ఇప్పటి వరకు ఎడమ కంటితో కూడా చూడలేదు.ఈ వివాదం తోనే కాటమరాయుడు మునిగిపోయి ఉంటే మరొక పక్క నుంచి ఈ సినిమా ని రెండు వారాల పాటు స్వచ్చందంగా బ్యాన్ చెయ్యాలి అంటూ అఖిల భారత సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కోరుతుంది.భారీ వసూళ్ళు దురాశతో కాటమరాయుడు సినిమా టికెట్ల ధరలను నాలుగైదు రెట్లు పెంచారని, రెండు వారాల పాటు థియేటర్లలో టిక్కెట్‌ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ కొందరు థియేటర్‌ దోచుకుంటున్నారని సంఘం ఆరోపణ.
కాటమరాయుడు సినిమాను రెండు వారాల పాటు బహిష్కరిస్తే దెబ్బకి ప్రొడ్యూసర్ లు దిగి వస్తారు అనేది సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం ప్లాన్.కాగా ఈ సంఘం ఒకటి వుందనే విషయం కనీసం ప్రేక్షకులకు కూడా తెలియదు.ఈ సంఘం మాటను లెక్కచేసి ప్రేక్షకులు ఎంత వరకు సినిమాకు వెళ్ళకుండా వుంటారనేది ఆ సంఘం వారికే తెలియాలి.అందులోనూ పవన్ కళ్యాన్ లాంటి పెద్ద స్టార్ సినిమాను ప్రేక్షకులు చూడకుండా ఆగగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న.

Have something to add? Share it in the comments

Your email address will not be published.