శ్రీరామ నవమి బహుమానం: గోవధకు వ్యతిరేకంగా ఫత్వా జారీ

All India Shia Personal Law Board Issues Fatwa Against Cow Slaughter

All India Shia Personal Law Board Issues Fatwa Against Cow Slaughter

శ్రీరామనవమిరోజు దేశం మొత్తం పందిళ్ళలో రామకళ్యాణాలు జరుగుతుంటే శుభవార్తను అందించింది షియా ముస్లిం బోర్డు. గోవధ కారణంగా దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నో ఏళ్ళుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం గోవధ. ఈ అంశానికి వ్యతిరేకంగా బీజేపీ ఎప్పటినుంచో పోరాటం చేస్తోంది. కేంద్రంలో బిజెపి కొలువు తీరిన తర్వాత పలు రాష్ట్రాల్లో గోవధకు వ్యతిరేకంగా కార్యక్రమాల్ని నిర్వహించింది. అంతేగాక గోవధకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. గోవధకు వ్యతిరేకంగా ముస్లింలే ముందుకొచ్చారు. నిజంగానే  ఇది ఊహించని వార్. దేశ‌వ్యాప్తంగా హిందువులు, ముస్లింల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మవుతున్న గోవ‌ధ అంశానికి కొంద‌రు ముస్లిం సోద‌రులే ప‌రిష్కారంతో ముందుకు రావ‌డం నిజంగా విశేష‌మే.

లక్నోలో జరిగిన ఆలిండియా షియా పర్సనల్‌ లా బోర్డు కార్యవర్గ సమావేశంలో కీలకమైన గోవధను నిషేధిస్తూ ఫత్వాను జారీచేశారు. ఇరాక్‌కు చెందిన ప్రముఖ షియా మతపెద్ద అయాతుల్లా షేఖ్‌ బషీర్‌ హుస్సేన్‌ నజఫీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత షియా బోర్డు గోవధకు వ్యతిరేకంగా ఫత్వాను అమల్లోకి తెచ్చింది. గోవధ కారణంగా దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని, అందుకే ఈ ఫత్వా జారీచేశామని షియా బోర్డు స్పష్టం చేసింది.

అంతేగాక మరో రెండు కీలక తీర్మాలను ఆమోదించింది ఆలిండియా షియా పర్సనల్‌ లా బోర్డు . ట్రిపుల్‌ తలాక్‌ నిషేధానికి మద్దతు పలికడమేకాకుండా రామజన్మభూమి-బాబ్రీ మసీదు విషయాన్ని కోర్టు బయట చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.