మేడమీద అబ్బాయిగా మారిన అల్లరి నరేష్

అల్లరి న‌రేష్‌, నిఖిలా విమ‌ల్ హీరో హీరోయిన్లుగా శ్రీమ‌తి నీలిమ స‌మ‌ర్ప‌ణ‌లో జాహ్న‌వి ఫిలింస్ బ్యాన‌ర్‌పై జి.ప్ర‌జిత్ ద‌ర్శ‌క‌త్వంలో బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్ నిర్మాతగా కొత్త చిత్రం `మేడ‌మీద అబ్బాయి` ఆదివారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్ట‌గా, నూజివీడు సీడ్స్ వైస్ ప్రెసిడెంట్ రామ‌కోటేశ్వ‌రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి భీమనేని శ్రీనివాస‌రావు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ – “నేను చేస్తున్న 53వ సినిమా `మేడ మీద అబ్బాయి`. గ‌మ్యం, శంభో శివ శంభో వంటి సినిమాల త‌ర్వాత ఆ రేంజ్‌లో పొటెన్షియ‌ల్ ఉన్న సినిమా ఇది. నాతో కెవ్వు కేక సినిమాను నిర్మించిన బొప్పన చంద్ర‌శేఖ‌ర్ ఈ సినిమాను నిర్మించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మల‌యాళంలో పెద్ద హిట్ అయిన `ఒరు వ‌డ‌క్కం సెల్ఫీ` చిత్రానికి ఇది రీమేక్‌గా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళం డైరెక్ట్ చేసిన ప్రజిత్ తెలుగులో కూడా డైర‌క్ట్ చేయ‌డం హ్యాపీ. సుడిగాడు సినిమాకు హిట్‌మ్యూజిక్ అందించిన డిజె.వ‌సంత్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్‌మూవీ. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ఇది. కామెడి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మార్చి 16 నుండి పొల్లాచ్చిలో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్త‌వుతుంది“ అన్నారు. నిఖిలా విమ‌ల్ మాట్లాడుతూ – “తమిళంలో రెండు సినిమాలు, మ‌ల‌యాళంలో రెండు సినిమాలు చేశాను. ఓ మంచి హిట్ సినిమా రీమేక్‌తో తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కావ‌డం అనేది హ్యాపీగా ఉంది“ అన్నారు. డిజె.వ‌సంత్ మాట్లాడుతూ – “సుడిగాడు రీమేక్ సినిమా. అదెంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు నేను, అల్ల‌రి న‌రేష్ చేస్తున్న ఈ సినిమాకు కూడా రీమేక్ సినిమానే. ఈ సినిమా కూడా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది“ అన్నారు.

నిర్మాత బొప్పన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “మ‌ల‌యాళంలో విడుద‌లై పెద్ద హిట్టైన ఒరువ‌డ‌క్క‌న్ సెల్ఫీ నాకు చాలా ఇష్టమైన సినిమా. నా హీరో అల్ల‌రి న‌రేష్‌గారు కొత్త క‌నిపిస్తే చూడాల‌నుకున్నాను. నాలుగేళ్ళు ఎదురుచూసిన త‌ర్వాత ఈ క‌థ దొరికింది. మంచి క‌థ‌, మంచి సినిమా అవుతుంది“ అన్నారు.

అల్ల‌రి న‌రేష్‌, నిఖిలా విమ‌ల్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, జ‌య‌ప్ర‌కాష్‌, తుల‌సి, సుధ‌, స‌త్యం రాజేష్‌, మ‌ధునంద‌న్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ ఆది, ప‌ద్మ జ‌యంతి, ర‌విప్ర‌కాష్‌, వెన్నెల రామారావు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మాట‌లుః చంద్ర‌శేఖ‌ర్‌(పిల్ల జమీందార్‌), కెమెరాః ఉన్ని ఎస్‌.కుమార్‌; స‌ంగీతంః డి.జె.వ‌సంత్‌, ఆర్ట్ః రాజీవ్ నాయర్‌; ఎడిట‌ర్ః నంద‌మూరి హ‌రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాతః బొప్పన చంద్ర‌శేఖ‌ర్‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః జి.ప్ర‌జిత్‌.

Have something to add? Share it in the comments

Your email address will not be published.