15మంది నటీనటులపై అల్లు అరవింద్ సీరియస్

Allu Aravind fires on 15 Artists who involved in Drug Racket

ఈమధ్య డ్రగ్స్‌కు అలవాటుపడి సినిమా పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్న కొంతమంది నటీనటులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో బయటపడుతున్న డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి డ్రగ్స్ కేసులో సినీ రంగానికి చెందిన 10 మందికి నోటీసులు ఇచ్చింది ఎక్సైజ్ శాఖ.

Allu Aravind fires on 15 Artists who involved in Drug Racket

ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, స్టంట్ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఆరు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. మాదక ద్రవ్యాల కేసులో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేసి, ఇద్దరు నిందితుల నుంచి 20 యూనిట్ల ఎల్‌ఎస్‌సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు విచారణ తర్వాత సినీరంగానికి చెందినవారికి నోటీసులు పంపించారు.

See Also: ఆగస్టులో మహాయుద్ధం: గెలుపెవరిది??

అయితే సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న డ్ర‌గ్స్ మాఫియాపై ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఘాటుగానే స్పందించారు. తెలంగాణ పోలీసులు ఈ మాఫీయా పై చేస్తున్న పోరాటాన్ని ప్ర‌శంసించిన అర‌వింద్, సినీ ప‌రిశ్ర‌మ‌లో 15 మంది నటీనటులు డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని, వారికి తాను చేసే డిమాండ్ ఒక్క‌టే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పిల్లి క‌ళ్ళు మూసుకొని పాలు తాగుతున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే అది క‌రెక్ట్ కాదు, మీరు చేస్తున్న ప్ర‌తి ఒక్క అంశం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉంది.. డ్రగ్స్ ఎప్పుడు? ఎక్కడ? ఎవరి వద్ద? ఎలా? తీసుకున్నారన్న ప్రతి రికార్డు కూడా వారి వద్ద వుంది అని అర‌వింద్ హెచ్చరించారు. ఇండస్ట్రీలో చాల కొద్దిమంది మాత్రమే ఈ డ్రగ్స్‌కు అలవాటుపడి ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని, ఇప్ప‌టికైన తమ త‌ప్పు తెలుసుకొని సినీ ప‌రిశ్ర‌మ‌కి చెడ్డ పేరు వచ్చే ప‌నులు చేయ‌వద్ద‌ని హిత‌వు ప‌లికారు అల్లు అరవింద్.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

Have something to add? Share it in the comments

Your email address will not be published.