పగిలిపోయేలా వాయిస్తున్న డీజే

Allu Arjun's DJ Trailer creates new records with highest views

Allu Arjun's DJ Trailer creates new records with highest views

పంచ్ డైలాగ్‌లతో పంచె కట్టి అదరగొట్టే స్టైల్‌తో వచ్చిన డీజే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డీజే దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే వచ్చిన వివాదాల కారణంగా విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్దిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులందరి సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో అదరగొడ్తోంది డీజే ట్రైలర్.

ట్రైలర్ విడుదలైన గంటలోనే లక్ష వ్యూస్ రాగా ఈరోజు ఉదయంకల్లా 25 లక్షలు క్రాస్ చేసేసింది. అదే టైంలో డిజే ట్రైలర్ కు భారీ సంఖ్యలో డిస్ లైక్స్ కూడా వచ్చాయి. 12 గంటల్లో 2.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 87 వేలకు పైగా లైక్స్, 28 వేలకు పైగా డిస్ లైక్స్ సొంతం చేసుకుంది.

బ్రాహ్మణుడిగా బన్నీ చెప్పిన ఫన్నీ డైలాగ్‌లతో పాటు ‘పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే..’ ‘మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామీ కాదు సార్.. యుద్ధం శరణం గచ్ఛామీ’, ‘ఇంగువా లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్లు’, ‘నేను నీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు.. పెద్ద బాలశిక్ష చదువుకున్నాను’  లాంటి డైలాగ్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ లోనే అల్లు అర్జున్ స్వయంగా కన్ఫామ్ చేశాడు. అయితే ఆ మధ్య అల్లు అర్జున్ కు, పవన్ కళ్యాణ్ అభిమానులకు గొడవ జరిగిన తర్వాత నుండి ఈ డిస్ లైక్స్ వ్యవహారం ఎక్కువైంది. డిస్ లైక్స్ వెనక ప్రధాన కారణం అదే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.